నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలో 30 లక్షల నిధులతో గ్రంథాలయ భవన నికి ఎమ్మెల్యే షకీల్ అమీర్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని అందులో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయ భవనాన్ని శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, రాజేశ్వర్, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్, తెడ్డు పోశెట్టి, లోకం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.