ప్రజా సమస్యలపై చర్చించే సభ లో వ్యక్తిగత దూషణలా…

– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిన వారే ఇంకొకరిని దూషిస్తూ నీతులు పలకడమేంటని,ప్రజా సమస్యలపై చర్చించే సభలో వ్యక్తిగత దుషణలేంటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రజల అభీష్టం మేరకు జెడ్పీటీసీ దంపతులు కాంగ్రెస్ లోకి చెరారన్నారు.రెండు పర్యాయాలు  జెడ్పీటీసీ గా గెలిచి ప్రజా సేవ చేసిన మంజుల లింగారెడ్డి మీద వ్యక్తిగత దూషణలు చేయడం హెయమైన చర్య అన్నారు.సొంత నియోజకవర్గం లోని సర్పంచు లకు బిల్లులు  చెల్లించ లేని అసమర్థ పాలన కెటియర్దన్నారు.పార్టీ మారిన వారే నీతులు మాట్లాడటం సిగ్గు చేటని ఏద్దేవ చేశారు.మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మేల్యేలను,కాంగ్రెస్ నాయకులను గుంజుకున్న చరిత బీఆర్ఎస్ ది కాదా అని ప్రశ్నించారు.ప్రజా సేవలో ఉండి ప్రజల అభిష్టానం మేరకు పనిచేస్తున్న ఏ పార్టీ నాయకులలైన సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.దోపిడే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ఏ పార్టీ నాయకులైన కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదన్నారు.నిన్నటి రోజు మండల సర్వ సభ్య సమావేశంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు ఏ విదంగా కొల్లగొట్టింది మా నేతలు బట్ట బయలు చేస్తున్నారన్నారు.కేటీఆర్ పేరు చెప్పుకొని తన అనుచరులు.. పథకాల పై కమిషన్ దోచుకుని కోట్లకు పడగలు ఎత్తింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మండలంలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతల చిట్టా మొత్తం ఉంది.రోజొక్కటి బయట పెట్టి ప్రజా క్షేత్రంలోనే శిక్షిస్తామన్నారు.కాంగ్రెస్ నాయకులపై అవాకులు పేలిన ఎవ్వరైనా సరే ప్రజా క్షేత్రంలో బుద్ది చెబుతామన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, పొన్నాల పరుశురాం, మునిగెల రాజు, బాలసాని శ్రీను, గడ్డం మదుకర్, నాగరాజు, భరత్, శ్యామ్ పాల్గొన్నారు.

Spread the love