
– ఉస్మానియా యూనివర్సిటీ ప్రొపెసర్ వాసర్ల నతాని యేలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఏఈడబ్ల్యూఎస్ (అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ) వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్, జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి సామాజిక సేవలు అభినందనీయమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొపెసర్ వాసర్ల నతాని యేలు అన్నారు. ఆదివారం సొసైటీ కాళేశ్వరం జోనల్ యువత అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అధ్యక్షతన, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ కోఆర్డినేషన్ లో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ సతీమణి రామబాయి అంబెడ్కర్ 126వ జయంతి వేడుకలు కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొపెసర్, మల్హర్ మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు లు ముఖ్యదితులుగా హాజరై రమాబాయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొపెసర్ యేలు మాట్లాడారు లింగమల్ల దంపతులు సామాజికంగా చేస్తున్న సేవలు గొప్పవని అభినందించారు.సొసైటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి,వర్థంతి వేడుకలు నిర్వహించడమే కాకుండా వారి జీవిత గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయడం,పేద విద్యార్థుల విద్యకు ఆర్థికంగా తోడ్పడటం గొప్ప విషయమన్నారు.కొయ్యుర్ లో రమాబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కుమార్ యాదవ్,సుధాకర్ లను అభినందించారు.ప్రతి ఒక్కరూ టైం,టాలెంట్,ట్రెజరు,టెక్నాలజి (టి-పోర్) వినియోసించడం అలవాటు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం యావత్ ప్రపంచానికి దిక్చుచిగా నిలిస్తే, మహనీయుల జయంతి ఉత్సవాలను, జీవిత చరిత్ర గ్రంథాలను పంపిణీ చేస్తూ లింగమల్ల దంపతులు అంబెడ్కర్ వారసులుగా నిలుస్తుండడం అభినందనీయమని ఎంపిపి మల్హర్ రావు అభినందించారు అనంతరం ప్రొపెసర్, ఎంపిపి,కళాకారులకు శాలువాలతో సొసైటీ సభ్యులు సన్మానించారు. బాధ్యత తీసుకొని సమావేశం ఘనంగా నిర్వహించిన కుమార్ యాదవ్, సుధాకర్ లకు అంబెడ్కర్, రామబాయి అంబెడ్కర్ చిత్రపటాన్ని లింగమల్ల దంపతులు బహుకరించారు.