చేపల లారీ బోల్తా..ఎగబడ్డ స్థానికులు

నవతెలంగాణ- దంతాలపల్లి :  ఫ్రీగా వచ్చినదాన్ని జనాలు వదులుతారా… కొనుక్కొని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అయ్యో అనాల్సింది పోయి.. అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయిందా అని కూడా కనికరం చూపించకుండా చేపల కోసం సంచులు పట్టుకుని వచ్చి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ఘటన మండలంలోని పత్తి మిల్లు సమీపంలోని వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే పై చేపల లారీ గురువారం ఉదయం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను వెళ్లగొట్టారు.

Spread the love