తర్కం….!

Logic...!ప్రాణం లేని మట్టి బొమ్మను భక్తితో పూజిస్తాం
ప్రాణం ఉన్న మనిషిలో కులాన్ని మతాన్ని వెతుకుతాం
అమ్మానాన్నలు అనాధాశ్రమంలో ఉండాలి..!
వాస్తు దోషం లేకుండా దేవుడికి ఇంట్లో పూజ గది ఉండాలి…!
కనిపించని దేవుడికి దగ్గర అవ్వాలని చూస్తాం..!
కని పెంచిన తల్లిదండ్రులను దూరం పెడతాం..!
కనిపించని భ్రమలతో కాలం గడిపేస్తూ
కనిపించే ప్రకృతిని ధ్వంసం చేస్తాం
వాస్తవాలను పక్కన పెడతాం
మూఢనమ్మకాలతో ఊరేగుతాం..!
గుడికెళ్తే దేవుడు కరుణిస్తాడని నమ్ముతాం
బడికెళ్తే భవిష్యత్తు మారిపోతుందని నమ్మం..
మూర్త -అమూర్త ఆలోచనల మధ్య నలిగిపోతు
తర్క వితర్కాల మధ్య కొట్టుమిట్టాడుతుంటాం
– డా|| మహమ్మద్‌ హసన్‌, 9908059234

Spread the love