ప్రయివేటు స్కూల్ కళాశాలల దోపిడీ..

– అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ సూచన
నవతెలంగాణ నసురుల్లాబాద్: బాన్సువాడ డివిజన్ లో ప్రయివేటు ఇంటర్‌, డిగ్రీ కాలేజీల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. అడ్మిషన్ల పేరుతో అక్రమంగా విద్యార్థులను మభ్యపెట్టి అడ్మిషన్లు అత్యధికంగా చేస్తున్నారని బాన్సువాడ డివిజన్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు అజయ్ కుమార్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని సీఐటీయూ భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని అలాగే ప్రభుత్వ కళాశాలలో అనుభవమైన లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఉంటున్నారని అందుకే ప్రయివేటు బదులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని వారు సూచించారు. బాన్సువాడ పట్టణంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అడ్మిషన్లు పొందుతున్నారని వారు ఆరోపించారు. అడ్మిషన్ తీసుకునే సమయంలో సకల సౌకర్యాలు కల్పిస్తామని చెబుతూనే చేరిన తర్వాత ముక్కు పిండి అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు వారు ఆరోపించారు. అడ్మిషన్‌ సమయంలో తల్లిదండ్రులకు కల్లబొల్లి మాటలు చెప్పి కళాశాల నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలో రకరకాల ఫీజుల పేర్లు చెప్పి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని. ఇంటర్‌లో స్కాలర్‌షిప్‌, డిగ్రీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకుని చదువు చెబుతామని హామీ ఇచ్చి అనంతరం ఫీజులు చెల్లిం చాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనందున ప్రయివేటు కాలేజీలు ఇష్టారీతిన వ్యవహరిస్తు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫిర్దోస్, జిల్లా సహాయ కార్యదర్శి సాగర్ పాల్గొన్నారుయి.

Spread the love