గ్రామాలలో జోరుగా బెట్టింగులు

నవతెలంగాణ – మోపాల్ 

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులగెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల భవిత్యం ఓటరు చేతిలో ఉండడంతో గెలుపు అవకాశాలపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ఒక దిక్కున ఐపీఎల్ బెట్టింగులైతే మరో దిక్కున ఎన్నికల బెట్టింగ్ ప్రధానంగా పోటీ తీవ్రంగా ఉన్న నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలో రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుకీలు లేకపోయినప్పటికీ స్థానికంగా బెట్టింగులు కాస్తున్నారు. గ్రామాల్లో కొందరు ఆ పందేలకు తెరతీసినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో రూ.5000నుంచి రూ.20000 మధ్య ఓట్లతో గెలిచే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ వేసినవారికి ఉత్కంఠ నెలకొంది. గ్రామాలలో బెట్టింగ్ స్థలాలు రచ్చబండలు, చాయ్ హోటల్లు ఆయస్థానాల్లో కూర్చుండి మా పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే మా పార్టీ అభ్యర్థి గెలుస్తారు అంటూ ఒకరికి ఒకరు బెట్టింగులు నిర్వహించుకుంతున్నరని సమాచారం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు బిజెపి అభ్యర్థి అరవింద్ మధ్య ఉంటుందని సమాచారం ఉత్కంఠకు తెరదించాలంటే జూన్ 4 వరకు ఆగల్సిందే.
Spread the love