
వరస సెలవులు పండగ తో లక్నవరం పర్యాటక కేంద్రం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యాటకులు వేలాదిగా తరలివచ్చి లక్నవరం పర్యాటక కేంద్రంలో అందాలను వీక్షించారు. రామప్ప మేడారం సందర్శించిన పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారు స్పీడ్ బోటు వేలాడే వంతెన పై నడుస్తూ సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకరంగా కాలక్షేపం చేశారు. స్థానిక జిల్లాల పర్యటకుల కాకుండా హైదరాబాదు మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు మేనేజర్ శంకర్ తెలిపారు. వరుసగా సెలవులు ఉండటం వల్ల పర్యాటకుల సంఖ్య పెరిగిందని పెరిగిన పర్యాటకులకు తగినట్టుగా సదుపాయాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అసంఖ్యాకంగా వస్తున్న వాహనాలను అదుపు చేయడం కష్టంగా మారింది. కార్ల శ్రేణులు కిలోమీటర్ల పొడవు నిలిచిపోయాయి. క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. లక్నవరం పర్యాటకులు దూర ప్రాంతాల నుండి లక్షలాదిక వస్తున్న పర్యాటకులకు అవసరమైన ఫుడ్ సౌకర్యం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు పేషెంట్లు వస్తున్నందున భోజన సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. వెంటనే క్యాంటీన్ ఓపెన్ చేసి పర్యాటకులకు రుచికరమైన భోజనాలను అందించాలని కోరుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుసాపురంలో అధిక ధర వెచ్చించి భోజనం చేయవలసి వస్తుందని అది కూడా రుచికరంగా లేదని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు