కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనేత

నవతెలంగాణ – జుక్కల్

కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనేత అని జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వినోద్ అన్నారు. శుక్రవారం నాడు మండలంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ప్రదానీ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను  మండల కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి  ఘణంగా నిర్వహించారు. అంతకు ముందుగా బాబు జగ్జీవన్ రావ్ చిత్ర పటానికి పూల మాలలవేసి నివాళ్లు అర్పించి జయంతి వేడుకలను ప్రారంబించి నిర్వహించారు. ఈ సంధర్భంగా వినోద్ మాట్లాడుతు దేశ స్వాతంత్రం కోసం , సమాజిక సమానత్వం కోరకు పోరాడిన మహనేత అని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేేస్ పార్టీ వర్గాలు, నాయకులు విండో డైరెక్టర్ విఠల్ పాటీల్, మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్, బిజ్జల్ వాడి మాజీ సర్పంచ్ గౌళే యాదవ్, యవ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love