నవతెలంగాణ – కంఠేశ్వర్
అనాగారినవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి బహుజనులకు ఆత్మబంధువు మహాత్మా జ్యోతిరావు పూలే అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జోతిబా పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా కోర్టు అవరణంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించరు అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ ఫూలే గారు అనేకమైనటువంటి సంస్కరణను తీసుకువచ్చి మనుషుల్లో సమానత్వాన్ని పెంపొందించాలని సత్యశోధకు సంస్ద ద్వారా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి మహనీయుడు ఫూలే అని ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని నేను కాదు నా సమాజం అనే ఆలోచన తోటి నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు వసంత్ రావు, ఆర్ రాజలింగం, ఏం గోవర్ధన్, పేదంరాజు కవితా రెడ్డి, అంజలి, లిల్లి, కిరణ్ కుమార్ గౌడ్, విఘ్నేష్, వెంకటేష్, విశ్వాక్ సేవ్, తదితరులు పాల్గొన్నారు.