Wednesday, April 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూరారంలో భారీ అగ్ని ప్రమాదం..

సూరారంలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న అనధికార స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలోని కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు భయాందోళనకు గురైన సమీప అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -