- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (నెం.12431)లో కోటా సమీపంలో బీ1 కోచ్, ఇంజిన్ కంపార్ట్‌మెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



