పెన్షనర్ల మహా ధర్నా విజయవంతం చేయండి..

నవతెలంగాణ- కంటేశ్వర్
పెన్షనర్ల ప్రధాన సమస్యలైన ఐ.ఆర్.తో పిఆర్సి కమిటీని ఏర్పాటు, పెండింగ్ డి ఎ లవిడుదల, నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్, ప్రవేట్ ఆసుపత్రులలో అనుమతించడం రాష్ట్ర ప్రభుత్వ శాఖల లో పనిచేసి ఇప్పటికీ హెల్త్ స్కీమ్ అమలు కానీ మార్కెటింగ్, గ్రంథాలయ,ఏఈడెడ్ సంస్థలలో నగదు రహిత వైద్యాన్ని అమలు చేయటం కమిటేషన్ వాల్యూను 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల కు తగ్గించటం ₹398/వేతనం తో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, తదితర ప్రధాన డిమాండ్ల సాధనకై పెన్షనర్స్ జెఎసి ఆధ్వర్యంలో జులై 12వ తేదీ బుధవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టడం జరుగుతుందనిి తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, జేఏసీ నాయకులు శ్రీధర్, మదన్ మోహన్, మార్కెటింగ్ పెన్షనర్స్ సంఘం రాజేందర్, బన్సీలాల్, పూర్ణచంద్రరావు తదితరులు మంగళవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో పత్రికా విలేకరుల సమావేశంలో పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ధర్నాను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి పెన్షనర్ పై ఉందని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ (జూలై 11) పెన్షన్లు, జీతాలు జమ కాలేదు. మనం కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించారా! ఈ పరిస్థితి మారాలన్నా ,మనం రోడ్ల మీదకి రావాల్సిందే! అందుకే తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు పెన్షనర్స్ జెఎసి ఇచ్చే పిలుపులల్లో భాగస్వాములై జులై 12వ తేదీన హైదరాబాద్ జరిగే ధర్నా ను విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు.

Spread the love