టీపీపీఎఫ్ మహాసభలను విజయవంతం చేయండి

– విద్యా, వైజ్ఞానిక మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – నెల్లికుదురు
వచ్చేనెల11, 12వ తేదీల్లో ఖమ్మంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని మండల బాధ్యులు జీ.బాలు పిలుపునిచ్చారు . మంగళవారం విద్య వైజ్ఞానిక మహాసభల పోస్టర్ ఉపాధ్యాయులకు కలిసి మండల కేంద్రంలో ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్సీ నెల్లికుదురు ముందు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం-2020 ప్రైవేటీకరణను బలోపేతం  చేస్తూ, ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకిక తత్వం, ఫెడరలిజం లాంటి రాజ్యాంగ లక్షణాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉందని, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల అవగాహ కొరకు విద్యా మహాసభలు దోహదపడతాయని అన్నారు. ఈ సమావేశంలో మండల సబ్ కమిటీ సభ్యులు సంగ శ్రీనివాస్, జీ. ఉదయ్ కిరణ్ ,ఎం. రవి, కే. బిక్షపతి, దయాకర్, పరంకుశ చారి, శ్రీనివాస్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love