మాలతి జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పై ఫోకస్

నవతెలంగాణ –  రెంజల్
రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మాలతి, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి వెళ్ళగా, రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ లో మూడవ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి, స్థానిక ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చానని, ఎలాగైనా జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఎంతో ఆశగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలలో 76 కేజీల విభాగంలో మూడవ మూడో స్థానంలో నిలిచినందుకు పాఠశాల ప్రిన్సిపల్ బలరాం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జ్యోతి, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Spread the love