Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదిలో మెరుగైన ఫలితాలు సాధించిన మల్లాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌

పదిలో మెరుగైన ఫలితాలు సాధించిన మల్లాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌

- Advertisement -

తెలుగు & ఆంగ్ల మాధ్యమాల్లో 84 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు
నవతెలంగాణ – నాచారం

మల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ (జడ్పీహెచ్‌ఎస్)లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు సంతృప్తికరంగా నమోదయ్యాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్‌ఎం శ్రీలత తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 107 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 84 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. తెలుగు మాధ్యమంలో 56 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆంగ్ల మాధ్యమంలో 85.3 శాతం పాస్ శాతం నమోదైంది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయవంతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని ఉపాధ్యాయులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు మరింత శ్రమించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన తల్లిదండ్రులు, సిబ్బందికి ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -