నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

– జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ : జి.వీరారెడ్డి
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని టేకుల సోమారం, పహిల్వాన్ పురం, రెడ్లరేపాక గ్రామ పంచాయితీ కార్యాలయాలను శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి. వీరారెడ్డి సందర్శించి రికార్డులు, టాక్స్ కలెక్షన్ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పోషక విలువల ఆహారం గురించి తెలుసుకున్నారు. పల్లెప్రకృతి వనం, క్రిమిటోరియం, నర్సరీలను పరిశీలించారు. ప్రతి మొక్క బ్రతకాలని, మొక్కల ఎదుగుదలను పరిశీలించాలని,  అవెన్యూ ప్లాంటేషన్లో క్రమబద్ధంగా వాటరింగ్ చేపట్టాలని, ప్రతి మొక్క సంరక్షించాలని ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పారిశుద్య చర్యలను పరిశీలించారు. రెడ్లరేపాక గ్రామంలో డేటా ఎంట్రీ పరిశీలించారు. చెత్తచెదారం కనబడకుండా పారిశుద్య కార్యక్రమాలు పకడ్బందీగా ఉండాలని గ్రామ పంచాయితీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతారెడ్డి, ప్రత్యేక అధికారులు శిరీష,దివ్య, ఏపీవో పరుశురాం, పంచాయితీ కార్యదర్శులు శ్రీనివాస్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love