– శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్
– నవతెలంగాణ జర్నలిస్టులకు ‘అతిథి’ అవార్డులు
నవతెలంగాణ-కల్చరల్
పత్రికల నిర్వహణ అంత సులువు కాదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై ‘అతిథి’ జాతీయ మాస పత్రిక దశాబ్ది వేడుకలు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ.. వేంకటేశ్వరరావు వ్యయ ప్రయాసలకోర్చి పదేండ్లుగా మాస పత్రికను సమర్థవంతంగా నిర్వహిస్తూ వివిధ రంగాల ప్రముఖులను సత్కరించటం అభినందనీయం అన్నారు. నాలుగు దశాబ్దాలు పత్రికారంగంలో ఉన్న వెంకటేశ్వరరావు అనుభవం ఆదర్శనీయం అన్నారు. స్వాగతం పలికిన అతిథి సంపాదకులు వేంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగాల పత్రికగా అతిథిని నిర్వహిస్తున్నామని తెలిపారు. అవార్డు గ్రహీతలలో నవతెలంగాణ సీనియర్ జర్నలిస్ట్‌లు బసవపున్నయ్య, జగదీష్ తదితరులు ఉన్నారు. వేదికపై సివిల్ సర్వీస్ అధికారి అజరు మిశ్రా, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్కె.మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ మాజీ విసి డిఎన్.రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, ప్రయివేట్ ఫార్మసీ కాలేజీల యాజమాన్యాల సంఘం నాయకులు కె.రాందాస్ తదితరులు పాల్గొన్నారు.