
నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని రావి గూడెం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గుర్రం అంజయ్య బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి ఎంపీపీ కర్నాటి స్వామి, మాజీ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారితోపాటు చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం గ్రామాలలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో మునుగోడు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, తాజ మాజీ సర్పంచ్ జక్కల శీను యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రావి గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు తీగల స్వామి యాదవ్, బూత్ కమిటీ అధ్యక్షులు ఉడత శ్రావణ్ కుమార్, రెడ్డి మల్ల వెంకటేష్, వరికుప్పాల వెంకన్న, మాజీ వార్డ్ మెంబర్ ఉడుత శ్రీశైలం, గుర్రం కృష్ణ తదితరులు ఉన్నారు.