మండలంలోని దుపహాడ్, లింగాల గ్రామాల నుండి సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో గురువారం మండల కేంద్రంలో సత్యా గార్డెన్ లో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోనికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వివరించి, గ్రామాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరించాలని, మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అభివృద్ది చేస్తామని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మండలి డైరెక్టర్ ఒంటెద్దు నరసింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు వికలాంగుల జిల్లా మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.