- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న వాంగ్ చుక్ నిరాహార దీక్షలకు మద్దతుగా సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని గోల్కొండ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నీట్ పేపరు లీకేజ్ కి బాధ్యత వహిస్తూ యూనియన్ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నగర కార్యదర్శి జె .కుమారస్వామి నగర కోశాధికారి కే అజయ్ బాబు నగర సహాయ కార్యదర్శి జి నరేష్ ఏ రాజు నగర కమిటీ సభ్యులు ఈ రవీందర్, జగదీశ్వర చారి నగర నాయకులు పి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



