మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ..

నవతెలంగాణ – ఆర్మూర్
విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ అధ్వర్యంలో పట్టణంలోని సివిఆర్ కాలేజ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నీట్ విద్యార్థులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు నరేంద రు ,ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు అఖిల్  మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధీనం లో నడుస్తున్న  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డ్ ను వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించి 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని అన్నారు. కేంద్రం రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నీ కాపాడి  నీట్ పరీక్షలను రాష్ట్రా ప్రభుత్వాల చే నిర్వహించాలని అన్నారు. అదే విధంగా కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి రీ – పరీక్షా నూ నిర్వహించాలని కోరారు.  తప్పు చేసిన కోచింగ్ సెంటర్ల పై శాశ్వతంగా నిషేధించి పేపర్ లీకేజీ లకు పాల్పడిన వారిని చట్ట పరంగా శిక్షించాలని అన్నారు.బాధిత నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే బీజేపీ పాలిత ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముట్టడికి వెనకడం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love