మండల కేంద్రంలో ఘనంగా మే డే ఉత్సవాలు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మే డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీఐటీయూ నాయకులు పాల్గొని కార్మికుల జెండా ఎగరవేసి జోహార్లు అర్పించారు సీపీఐ(ఎం) ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతిరాం నాయక్ గాంధారి మండల నాయకులు కమ్మరి సాయిలు హమాలి సంఘం నాయకులు సరాబ్ కిషన్ రావు గిరిజన సంఘం జిల్లా నాయకులు ప్రకాష్ నాయక్ కార్మిక సంఘం మధు సఫాయి సంఘం నాయకులు దాకయ్య బి సాయిలు లలిత సంజీవులు భూపతి నరసింహులు భూమయ్య సాయవ్వ ఆశవా గంగామణి పవిత్ర సాయవ్వ తదితరులు పాల్గొని మేడి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. 1886 అమెరికాలోని  చికాగో నగరాన కార్మికుల  పని గంటలు తగ్గించడం కోసం జరిగిన పోరాటంలో జరిగిన పోరాటంలో చనిపోయారని ఎందరో మహానుభావులు చనిపోయారని రక్తంతో తడిచిన గుడ్డే ఈరోజు ఎర్రజెండాగా నిలబడిందని అన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి ఆ నినాదం ప్రపంచమంతా పాకింది అన్నారు. ఎర్ర జెండాకు మరణము లేదని కాలం కార్మికులు కర్షకులు ఉన్నంతవరకు ఎర్రజెండా అజేయంగా నిలబడింది అన్నారు. వీరమరణం పొందిన వారికి జోహార్లు అర్పించారు.
Spread the love