ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ కార్మిక లోకానికి పండుగ దినం మేడే అని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. మేడే పురస్కరించుకుని గురువారం ఆయన మాట్లాడారు. ప్రపంచ కార్మిక లోకానికి వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగిన రోజు మేడేన్నారు. కార్మికుల రక్తం నుండి ఎర్రజెండా ఉడవించిన రోజన్నారు. దేశంలో కార్మికుల హక్కుల పరి రక్షణ కొరకు ఆర్టీఐ శ్రమిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో కార్మికులకు సమస్యల పరిష్కారానికి ఆర్థిక అభివృద్దికి సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందన్నారు. నేడే అమరవీరుల ఆశయ సాధన కోసం కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలిసివచ్చే ఇతర సంఘాలతో ఆర్టీఐ కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉందన్నారు. మండల ప్రజలకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



