
ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు చకిలం కృష్ణకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉండ్రుగొండ గుట్టలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి 16వ బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. శ్రీమాన్ ఆరుట్ల రవికుమారాచార్యులు, అరవింద చార్యులు, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో త్రయాహిక దీక్షతో అత్యంత వైభవంగా ఈనెల 27,28,29 తేదీల్లో జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లాల నుంచి కాకుండా ఇతర జిల్లాల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బంధకవి కృష్ణమోహన్, యలగబోయిన శ్రీరాములు, కైరోజు శంకరాచారి,నరసయ్య,గుండా శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.