– కార్పొరేటర్ నాగేందర్ యాదవ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఎల్లమ్మ తల్లి దీవెనలు ప్రజలపై ఉండాలని శేర్లిం గంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆదర్శ్‌నగర్ రోడ్ నెంబర్ 1లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనాల మహౌ త్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్దలతో, బోనాల ఊరేగుంపుగా వెళ్లి మహిళలు అమ్మ వారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికార పండుగగా ప్రకటిం చారని ఈ పండుగ తెలంగాణ సాంస్కృతీ సంప్రదా యాలకు ప్రతీకగా నిలుస్తోంద న్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, శ్రీనివాస్ రాజ్ ముది రాజ్, పవన్, మహేష్, కేఎన్ రాములు, గోపాల్ యా దవ్, రవి యాదవ్, ప్రీతం మిరియాల, శ్రీనివాస్, యాద గిరి, రవి ప్రకాష్, రవి, ప్రశాంత్, శ్రీనివాస్, ఇమ్రాన్, మనన్, ఆలయ కమిటీ మెంబర్స్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.