మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాటం

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కూశన రాజన్న
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
మేడే ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే రోజులలో కార్మికులు సంఘటితంగా తమ హక్కుల కోసం పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అన్నారు. మేడే సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో జెండాలను ఆవిష్కరించారు. రాజీవ్‌చౌక్‌, మున్సిపల్‌ కార్యాలయం, సీహెచ్‌సీ వద్ద సీఐటీయూ పతాకాలను, సంజీవయ్యకాలనీ, సర్దార్‌బస్తీ, పార్టీ కార్యాలయం, ఎస్పీఎం వర్కర్స్‌ గేటు ముందు పార్టీ పతాకాలను, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు టీఎస్‌యుఈఈయు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో వివిధ సంఘాల కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కూశన రాజన్న మాట్లాడుతూ నాడు చికాగో నగరంలో కార్మికులు అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న హక్కులను నేటి బీజేపీ ప్రభుత్వం హరించివేస్తోందన్నారు. లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను పకడ్భంధీగా అమలు చేస్తామని హామీ ఇచ్చే బహుళజాతి కంపెనీలను మాత్రమే మన దేశంలోకి ఆహ్వానించాలని, అప్పుడే ఆయా కంపెనీలలో పని చేసే కార్మికులు శ్రమదోపిడీ నుండి కాపాడుకోబడతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంజం ఆనంద్‌కుమార్‌, త్రివేణి, కోట శ్రీనివాస్‌, అల్వల చంద్రయ్య, దస్తగిరి, రవి, జాడి మల్లయ్య, సుదర్శన్‌, పద్మ, అనిత, సాయికృష్ణ, శంకర్‌, సంజీవ్‌, శంకరమ్మ, రవి పాల్గొన్నారు.
విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం (ఐఎన్‌టీయూసీ) 327 ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ ట్రాన్స్‌కో డివిజన్‌ కార్యాయంలో మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎమ్మాజి సతీష్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం చేసే పోరాటాలలో తమ సంఘం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్‌, కంపెనీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, నాయకులు శ్రీనివాస్‌, ప్రదీప్‌, ప్రవీణ్‌, కుమారస్వామి, కేదారి, రాంచందర్‌, బుచ్చిబాబు, శకుంతల, రమాదేవి, లత, లక్ష్మి పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో…
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కాగజ్‌నగర్‌లోని సివిల్‌ సప్లయి గోదాంలో మేడే వేడుకలు నిర్వహించారు. జెండాను సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుమార్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, హేమాజీ, కిషన్‌, సురేష్‌, రాజు పాల్గొన్నారు. అదేవిధంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమొక్రసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తాలోని కనకయ్య స్థూపంతో పాటు పార్టీ కార్యాయం వద్ద, కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ, వల్లకొండ గ్రామాలలో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి చాంద్‌పాషా, నాయకులు లచ్చన్న, బండారు తిరుపతి, రత్నం పోశన్న, ప్రసాద్‌, చంద్రన్న, రమేష్‌, పీడీఎస్‌యూ నాయకులు బౌరె కళ్యాణ్‌, జగజంపుల తిరుపతి పాల్గొన్నారు.

Spread the love