వేసవి శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
విద్యార్థులు సెలవుల్లో సెల్‌ ఫోన్లు, టీవీలకు అంకితమై తమ భవిష్యత్తును చెడు మార్గంలో పోకుండా ఉండటానికి ఈ వేసవి శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలని పౌర సమాజ సభ్యులు వెండి బద్రేశ్వర్‌ రావు అన్నారు. బుధవారం సంస్కార్‌ డ్రీమ్‌ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వేసవి సైన్స్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఇందులో విద్యార్థులకు పాఠశాలలో బోధించని ఇతర కోకరిక్యులర్‌ యాక్టివిటీస్‌ని నేర్పడం అభినందయనీయమని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, వచ్చిన విద్యార్థులు పూర్తి సమయాన్ని ఈ వారం రోజులు వెచ్చించి నేర్చుకోవాలని అన్నారు. ఈ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉత్తమ పౌరులుగా ఎదుగుదలకు కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదికను అభినందించారు. ఈ శిక్షణలో గణితంతో గమ్మత్తులు, డ్రాయింగ్‌, గుడ్‌ హ్యాండ్‌ రైటింగ్‌, ఓరిగామి, సైన్స్‌ మ్యాజిక్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించుకోవాలని అన్నారు. తమతో పాటు తమ స్నేహితులు కూడా సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రఘు రమణ, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌, కోశాధికారి కత్తి శ్రీధర్‌ బాబు, జిల్లా బాధ్యులు ఎల్గుర్తి శ్రీనివాస్‌, పెంటపర్తి ఊశన్న, ఉమాకాంత్‌, మెస్రం రాజు, సురేష్‌, ఆత్రం సంతోష్‌, గెడం రవీందర్‌, లింగారెడ్డి పాల్గొన్నారు.

Spread the love