న్యూఢిల్లీ : భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను ఎన్నికైంది. కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఎస్. సతీశ్ కుమార్ వైస్ చెర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న మీరాబాయి చాను నాలుగేండ్ల పాటు ఈ పదవిలో కొనసాననున్నారు. ‘అథ్లెట్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్ను ఎన్నుకున్నందుకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యకు ధన్యవాదాలు. సహచర వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుల తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించటం గర్వంగా భావిస్తున్నాను’ అని మీరాబాయి చాను తెలిపింది.