కాంగ్రెస్తోనే ఉపాధి హామీ పథకం: మెగావత్ సరిదాస్

నవతెలంగాణ – నవీపేట్
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని గత పది సంవత్సరాల లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వేదం చేసేందుకు పూనుకున్నాయని బోధన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఉపాధి హామీ కోఆర్డినేటర్ మెగావత్ సరిదాస్ అన్నారు మండల కేంద్రంలోని దర్యాపూర్, అభంగపట్నం గ్రామాలలో చెరువులలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలను శుక్రవారం ఎంపీ ఎన్నికల సందర్భంగా కలిసి మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రోజు రోజుకో నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ 400 కు పెంచడమే గాక పని దినాలను సైతం పెంచుతుందని అన్నారు. కాబట్టి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Spread the love