
నవతెలంగాణ – ఖమ్మం
గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న జనరల్ స్థానాల నుండి అప్పటి రాజకీయాల పరిస్థితులు వల్ల బీసీలకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ, రాజ్యసభకు శ్రీమతి రేణుక చౌదరి గారికి కేటాయించిన సందర్భంలో, ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఉద్దేశంతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యునిగా, అనంతరం ఖమ్మం పార్లమెంటరీ టాస్క్ఫోర్స్ మెంబర్ గా నియమింపబడిన వివాదరహితుడు విద్య వంతుడు మొదటి నుండి సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబం నుండి వచ్చిన మేడం శ్రీనివాస్ యాదవ్ గతంలో మొదటి నియోజవర్గంలో భట్టివిక్రమార్క కి అత్యంత సన్నిహితునిగా, అనంతరం ఖమ్మం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా. శ్రీమతి రేణుకా చౌదరి కి అత్యంత దగ్గరగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఆయిన సందర్భంలో జిల్లాలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ముందుకు నడుస్తున్న నాయకునిగా, అన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు నిస్సహాయులకు సహాయ సహకారాలు అందిస్తూ.. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందిన శ్రీనివాస్ యాదవ్ కి . కేటాయించి నట్లయితే బిసి నేతకు కేటాయించి నట్లుగా గెలుపు సాధ్యమవుతుందని భావించినట్లుగా విశ్వసనీయ సమాచారం.