నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్​ బోర్డ్ సభ్యులు

– రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యాటన
– డ్యామ్ పై చేపడుతున్న మరమ్మత్తుల పనులను పరిశీలించనున్న బృందం
– ఆంధ్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో రంగంలో దిగిన కేఆర్ఎంబి బృందం
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పర్యవేక్షించుటకు కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్  సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి, అధికారుల బృందం గురువారం నాగార్జునసాగర్ చేరుకున్నారు.ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందస్తుగా డ్యాం మరమ్మతులు పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టేది. కానీ ఈ ఏడాది మాత్రం ఆంధ్ర ,తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదం కారణంగా మరమ్మత్తులను ఎపి ప్రభుత్వం అభ్యంతరం తెలపడం తో కే.ఆర్.ఎం.బి బృందం రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరమ్మత్తుల విషయంలో ఏపీ వైపు ఉన్న కుడికాలువకు సంబంధించిన ఒక గేటు గతంలో కొట్టుకుపోగా.. ఆ గేటుతోపాటు 8 గేట్లను తెలంగాణ ప్రభుత్వం నూతన మరమ్మత్తులు చేపట్టింది. ఆ గేట్ల పైన బీటీరోడ్ల మరమ్మతులు, ఇతర పనులను చేయాల్సి ఉంది. ఇక గేట్లు ఉండే క్రేన్‌కు సంబంధించిన పట్టాల పనులు కూడా పూర్తవ్వాల్సి ఉండగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఈనెల 16వ తేదీన కృష్ణాబోర్డుకు ఏపీ సర్కారు లేఖ రాసింది.  2014 రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ డ్యామ్ బాధ్యతలను తెలంగాణ నిర్వహిస్తోంది. వర్షాకాలానికి ముందే సాగర్‌ మరమ్మతులు పూర్తిచేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులు జరుగుతుండగా.. ఓ దశలో సీఆర్‌పీఎఫ్‌ అడ్డుకోగా.. మరోవైపు లేఖలతో ఏపీ అభ్యంతరాలు తెలిపింది. దాంతో కృష్ణాబోర్డు అనుమతితో ఇటీవలే పనుల్లో కదలిక వచ్చింది. ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో కృష్ణాబోర్డు రంగంలోకి అట్టి పనులను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చేపట్టుటకు ఆదేశాలు జారిచేయడం జరిగింది.మరమ్మతుల పురోగతిని, సాగర్ డ్యామ్ పూర్తి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.రెండు రోజుల పాటు నాగార్జునసాగర్ డ్యాం పై చేపట్టనున్న మరమ్మత్తు పనులను కె.ఆర్.ఎం.బి అధికారులు పరిశీలించనున్నారు.వీరితో పాటు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు టీం మరియు తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జున, డిఈ శ్రీనివాస్‌ రావు, ఏఈ కృష్ణయ్య, సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌, నాగార్జునసాగర్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఇరిగేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love