టోటల్‌ ఎనర్జీస్‌తో ఎంఐబీఎల్‌ ఒప్పందం

ముంబయి : వినియోగదారులకు కారు బీమా సేవలను అందించడానికి టోటల్‌ ఎనర్జీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మహీంద్రా ఇన్యూరెన్స్‌ బ్రోకర్‌ లిమిటెడ్‌ (ఎంఐబీఎల్‌) తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టోటల్‌ ఎనర్జీస్‌ క్వార్ట్జ్‌ ఆటో సర్వీసెస్‌ వర్క్‌షాప్‌లలో సమగ్ర బీమా సేవలను అందించనున్నట్టు తెలిపింది. దీంతో కారు యాజమానుల బీమా ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. దేశంలోని 235 టోటల్‌ ఎనర్జీస్‌ క్వార్ట్జ్‌ల్లో తమ సేవలు లభించనున్నాయని పేర్కొంది.

Spread the love