స్టోన్ క్రషర్స్ ను తనిఖీ చేసిన మైనింగ్ అధికారులు

నవతెలంగాణ – చివ్వేంల
మండల పరిధిలోని ఉండ్రు గొండ గ్రామంలోని ఎన్ జె రెడ్డి క్రషర్ మిల్లుపై  స్థానిక ప్రజలు యిచ్చిన ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం మైనింగ్ అధికారులు  తనిఖీలకు వస్తున్నారని విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  క్యారీ వద్దకు చేరుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అశోక్ రెడ్డి ఎస్సై వెంకట్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.  అనంతరం మైనింగ్ ఏడి బివి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్ జె  రెడ్డి క్రషర్ మిల్లు  లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం  క్యారీని, అదేవిదంగా క్రషర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో డంపు చేసిన మెటీరియల్ ను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో సర్వే రిపోర్ట్ వస్తుందని సర్వే రిపోర్ట్ వచ్చిన  వెంటనే ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో పొల్యూషన్ బోర్డ్  ఏఈఈ శంకర్ బాబు,డి ఎస్పీ నాగభూషణం,మైనింగ్ ఆర్ ఐ కృష్ణమరాజు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రంగారావు,ఆర్ ఐ రామారావు, ఉండ్రు గొండ, వల్లభాపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love