రేపు మల్హర్ లో మంత్రి దుద్దిళ్ల పర్యటన

– పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
– కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– ఎంపిపి మలహల్ రావు, వైస్ ఎంపిపి బడితేల స్వరూప
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో రేపు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపనలు  నిర్వహించునట్లుగా మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు మల్లారం పరిదిలో కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో రూ.3కోట్లతో నిర్మాణం చేపట్టిన అదనపు గదులు,ఆరోగ్య ఉపకేంద్రము రూ.15 లక్షలు, తాడిచెర్లలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి గది రూ.15 లక్షలు,ఆరోగ్య ఉప కేంద్రము, లైబ్రరీ రూ.25 లక్షలు, రైతులు పొలాల వద్దకు వెళ్ళేందుకు మోటు ఒర్రె మరమ్మతులు రూ.40 లక్షలు,రూ. 65 లక్షలతో నిర్మాణం పూర్తియిన తహశీల్దార్ కార్యాలయం, కాపురం ఆర్అండ్ఆర్ సైట్ లో రూ.3కోట్లతో విద్యుత్ మరమ్మతులు తదితర రూ.10 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం చేయునట్లుగా తెలిపారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించునట్లుగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్ పాల్గొన్నారు.
Spread the love