అధికారం ఉందని విర్రవీగిన గువ్వల గువ్వను గుయ్యి అనిపించారు: మంత్రి జూపల్లి

– అచ్చంపేట ప్రజలను అభినందించిన మంత్రి

నవతెలంగాణ – అచ్చంపేట 
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం, పదవులకు ఎవరు శాశ్వతం కాదు. కానీ అధికారం ఉందని మీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  గువ్వను గుయ్యి అనిపించారనీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ప్రజలను అభినందించారు. మంగళవారం పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికార అహంకారంతో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనీ, పరిపాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను అవమానపరిచారనీ,  సొంత పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారనీ  ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎంత విర్రవీగారో మనందరికీ తెలుసు అన్నారు.  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మీరు చైతన్యమై ఓటు హక్కు తో గువ్వల బాలరాజు గువ్వను గుయ్యి అనిపించారనీ అభినందించారు. ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో 50 వేల మెజార్టీ ఎవరికి రాలేదని గుర్తు చేశారు. వంశీకృష్ణ మీద మీరు చూపిన ఆదరణ , ప్రేమ ఆప్యాయత కు ప్రత్యేకంగా అభినందిస్తున్నానీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Spread the love