కేసీఆర్ రకరకాలుగా రాష్ట్రన్ని అప్పుల పాలుచేశాడు: మంత్రి కోమటిరెడ్డి

– చేపలు, గొర్రెలు అనేక పథకాలల్లో  అవినీతి…
– ఎంపీ గా కవిత ను గెలిపిస్తే  లిక్కర్ దందా తో ఢిల్లీలో  పరువు తీసింది..
– పెండింగ్ ఉన్న  పనులను పూర్తి చేస్తాం…
బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాదు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేసీఆర్ రకరకాలుగా రాష్ట్రన్ని అప్పుల పాలుచేశాడని,చేపలు, గొర్రెలతో పాటు అనేక పథకలల్లో  అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిజామాబాద్ ఎంపీ గా కల్వకుంట్ల కవిత ను ప్రజలు గెలిపిస్తే  లిక్కర్ దందా తో ఢిల్లీలో  పరువు తీసిందని, నిజామాబాద్ జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, బీఆర్ ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సిటు రాదని రాష్ట్ర రోడ్డు భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ గ్రామ శివారులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో లో పాల్గొని  కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జివన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తో కలిసి మాట్లాడారు. ఢిల్లీ లో  బిజెపి ప్రభుత్వం 10 ఏళ్ళ లో ఏం చేశారని చెప్పకుండా రాముడి తో ప్రచారం చేసుకుంటున్నారన్నారు.మూడు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ అర్ అర్ టాక్స్ అంటూ విష ప్రచారం చేసి లాబ్ది పోయిందని చుశారని మండిపడ్డారు.అందే శ్రీ రాసిన గీత  పై,లోగా పై  కేటీఆర్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నోరో అర్థం కాలేదన్నారు.లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ధరణి స్కామ్ ఇంకా ఎన్ని స్కామ్ లో ఉన్నాయో ఒకోక్కటి వెలుగులోకి వస్తున్నాయని వివరించారు.ఎంపీ గా ఉన్న  నన్ను ఏనాడు కేసీఆర్  కాల్వనియలేదని,నిర్బంధ తెలంగాణ గా కేసీఆర్ పాలన చేశాడని విమర్శించారు.బోధన్ చెక్కర ఫ్యాక్టరీ ని పునరుద్ధరణ చేస్తామని,కాంగ్రెస్ పార్టీ కి దక్షిణ, ఉత్తర తెలంగాణ అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తామని దిని లో ఏలాంటి అనుమానాలు వ్యక్తం అవసరం లేదన్నారు.భారస  ఎమ్మెల్యేలు  చివరికి  ఆరుగురు లేద ముగ్గురు పార్టీ లో మిగులుతారని, భారస పార్టీ భవిష్యత్తు లో ఇక ఉండదని జోస్యం చెప్పారు.
రాష్ట్రాన్ని పదేళ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని మంత్రి విమర్శించారు.కేసీఆర్ జర్నలిస్ట్ కాలనీ లు ఏర్పాటు చేస్తామని మోసం చేశారన్నారు.రాష్ట్రం కోసం1200 మంది  అమరుల   త్యాగం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, జూన్ 2న ప్రభుత్వం అవతరన దినోత్సవం ఘనంగా నిర్వహించా తలపేట్టిందని వెంకట్ రెడ్డి వివరించారు.బీఆర్ఎస్ నేతలు స్కాములతో తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. బతుకమ్మల చాటున కవిత లిక్కర్ దందా చేసిందని ఆరోపించారు. బీజేపీ మతప్రాతిపదికన ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. జూన్ 5 నుండి అభివృద్ధి పైనే మా దృష్టి ఉంటుందని,రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ తో యువతకు ఉపాధి కల్పిస్తామని పునరుద్ఘాటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఖతమవు తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 13 సీట్లు గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ  పారదర్శకంగా పాలన సాగుతుందని అన్నారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, నాయకులు గడుగు గంగాధర్, కేశ వేణు, మునిపల్లి సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, జావీద్ అక్రం, తోపాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం..
హైదరాబాద్ నుండి డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ శివారు లోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాష్ట్ర రోడ్డు భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.పులమలలు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల కిషన్, డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి,ట్రెజరర్ కుంట గంగారెడ్డి, బైరయ్య, నారాయణ, కుమ్మరి గంగాధర్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్,సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love