దంచి కొట్టిన వాన

– వృక్షాలు, కరేంట్ స్థంబాలు నేలమట్టం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అకల వర్షానికి పెద్ద పెద్ద వృక్షాలు కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఏకధాటిగా కురిసిన వర్షాలకు గానూ రహదారుల వెంట ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ప్రజలు సైతం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎండలు 45 డిగ్రీల వరకు దంచి కొట్టడంతో ప్రజలకు అకాల వర్షం చల్లటి కబురు ఇచ్చింది. రాబోవు రోజుల్లో వర్షం ముప్పు ఇంకా పొంచి ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించడంతో మండలంలో ఎండ తగ్గుముఖం పట్టవచ్చని పలువురు అంటున్నారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వేసిన ధాన్యం సైతం వర్షపు నీతిలో తడిసిపోయిందని, కొన్నిచోట్ల రేకులు ఊడిపోయాయి. మరికొన్ని చోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు సైతం నేలకొరిగాయి. మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Spread the love