పశువుల కొవ్వు నుండి నూనె తయారీ ..

– విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు..
నవతెలంగాణ – కోదాడ రూరల్
పశువుల కొవ్వు నుండి నూనెను తయారి చేస్తున్న విషయం గుట్టు రట్టయింది. పట్టణంలో ఈ విషయం కలకలం సృష్టిస్తుంది. పశువుల కొవ్వు నుండి నూనె తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు అయినా సంఘటన గురువారం చోటు చేసుకుంది. టౌన్ సిఐ రాము తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని సాలార్జంగ్ పేట నందు మటన్ సెంటర్ నడిపే షేక్ యాదుల్ తండ్రి అబ్బుమియా అనే అతడు పశువుల కొవ్వు నుండి తయారు చేసిన నూనె ను గుర్తు తెలియని హైద్రాబాద్ వారికి అమ్మటానికి గాను స్టాక్ పెట్టుకున్నట్లుగా నమ్మదగిన సమాచారం రాగా టౌన్ సీఐ రాము సిబ్బంది తో వెళ్ళి సాలార్జంగ్ పేట లోని అతడి ఇంటి నుండి  45 లీటర్ల నూనెను ( కొవ్వు నూనె)  స్వాదీనం చేసుకొని నిందితుడు అయిన షేక్ యాదుల్ ను అరెస్టు చేశారు. ఈ పశువుల మాంసపు కొవ్వు ల నుండి తయారు చేసిన నూనె వల్ల ప్రజల ఆరోగ్యాలకు హానికరం అని తెలిసి, గవర్నమెంట్ వారిని మోసం చేస్తున్న  షేక్ యాదుల్ పై చీటింగ్, ఆహారపు కల్తీ చట్టాల క్రింద కేసు నమోదు చేసినట్లు టౌన్ సిఐ రాము  తెలిపినారు.
Spread the love