చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్ర శివారులోని బ్రహ్మంగారి గుట్ట వద్ద  63వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం వాహనాలను  ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్ పల్లి శివారులో అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద  ఎంపీడీవో శ్రీనివాస్ ఉదయం చెక్ పోస్ట్ గుండా వెళ్లే వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. వాహనదారులతో మాట్లాడి వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనదారులు  రూ. 50వేలకు మించి నగదును వెంట ఉంచుకోవద్దని, అంతకంటే ఎక్కువ నగదు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో చెక్ పోస్ట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love