నవతెలంగాణ – హైదరాబాద్
ఈ వేగం అభివృద్ధి చేస్తూ, ELECRAMA 2025 3వ రోజున భారతదేశపు శక్తి పరివర్తన, పాలసీ దిశ, మరియు సాంకేతిక పురోగతుల పై కీలకమైన చర్చల కోసం గౌరవనీయ మంత్రి పీయుష్ గోయల్, కామర్స్ & పరిశ్రమల శాఖ, భారత ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేయడానికి కీలకమైన ప్రసంగం చేసారు. స్వదేశీ తయారీని శక్తివంతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధత, పరిశుభ్రమైన శక్తిని అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి మరియు వినూత్నత మరియు సహకారం ద్వారా విద్యుత్తు రంగాన్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడాన్ని నిర్థారించవలసిన ప్రాధాన్యతను సునీల్ సింఘ్వి, ప్రెసిడెంట్, IEEMA, విక్రమ్ గండోట్ర, ప్రెసిడెంట్ (ఎలక్ట్) మరియు ఛైర్మన్, మరియు సిద్ధార్థ భుటోరియ, వైస్ ప్రెసిడెంట్, IEEMA & వైస్ ఛైర్మన్, ELECRAMA 2025, వంటి గౌరవనీయులైన నాయకులతో కలిసి పీయుష్ గోయల్ తెలియచేసారు. సుస్థిరమైన శక్తి పరిష్కారాల్లో అంతర్జాతీయ నాయకునిగా మారవలసిన భారతదేశపు కలను ఆయన ప్రసంగం మద్దతునిచ్చింది. పాలసీ మద్దతు, వ్యూహాత్మకమైన పరిశ్రమ భాగస్వామాలు, మరియు ఆధునిక సాంకేతికతలలో పెట్టుబడి ప్రాధాన్యతను తెలియచేసారు. ఏకీకృత ప్రపంచ స్థాయికి చెందిన ప్రదర్శన వేదికను నిర్మించవలసిందిగా, భారతదేశాన్ని విద్యుత్తు మరియు శక్తి పరిష్కారాల కోసం అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలబెట్టవలసిందిగా భారతదేశపు విద్యుత్తు పరిశ్రమను గౌరవనీయ పీయుష్ గోయల్, యూనియన్ కావర్స్ & ఇండస్ట్రీ, భారత ప్రభుత్వం అభ్యర్థించారు. ELECRAMAలో మాట్లాడుతూ, ELECRAMA సహా ఇతర పరిశ్రమలో నాయకత్వంవహించే ప్రధానమైన ఎగ్జిబిషన్స్ విలీనమైన ఒక ప్రదర్శనగా ఉండవలసిన ప్రాధాన్యతను మరియు అంతర్జాతీయ భాగస్వాముల కోసం భారతదేశాన్ని ఏకైక వేదికగా ఉంచవలసిన అవసరాన్ని ఆయన తెలియచేసారు. “అంతర్జాతీయ శక్తి పరివర్తనలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ పరివర్తనలో మన విద్యుత్తు పరిశ్రమ కీలకమైన బాధ్యతవహిస్తుంది. బహుళ విభాగాల ఎక్స్ పోస్ ను నిర్వహించడానికి బదులుగా, ప్రపంచాన్ని మన పూర్తి సామర్థ్యాలను చూపించడానికి ఒకే, అతి పెద్ద కార్యక్రమాన్ని తయారు చేయడానికి మనం తప్పనిసరిగా కలిసికట్టుగా ముందుకు రావాలి. 1,500 ఎగ్జిబిటర్స్, 100,000+ సందర్శకులతో మరియు అతి పెద్ద అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొనే ఎగ్జిబిషన్ ను ఊహించండి– ఇది భారతదేశాన్ని అంతర్జాతీయ విద్యుత్తు రంగానికి ప్రధానమైన కేంద్రంగా దృఢంగా స్థిరపరుస్తుంది,” అని శ్రీ పీయుష్ గోయల్ అన్నారు.
ఈ కలను నిజం చేయడానికి నాయకత్వంవహించవలసిందిగా మరియు భారతదేశపు స్వదేశీ రంగం శక్తివంతంగా అభివృద్ధి చెందడాన్ని నిర్థారిస్తూనే ఎగుమతులు మరియు అంతర్జాతీయ భాగస్వామాలను విస్తరించడాన్ని కూడా నిర్థారించవలసిందిగా ఆయన పరిశ్రమ అసోసియేషన్స్ ను కోరారు. “ప్రపంచాన్ని భారతదేశానికి తీసుకువద్దాం. పెద్ద ఎత్తున ప్రభావం కలిగించే ఏకీకృత వేదికను మనం తయారు చేసినట్లయితే, విద్యుత్తుకు చెందిన అన్ని విషయాలకు భారతదేశం ఏకైక గమ్యస్థానంగా అంతర్జాతీయ భాగస్వాములు తెలుసుకుంటారు. విద్యుత్తు మౌళిక సదుపాయం, ఆటోమేషన్ అయినా, లేదా స్మార్ట్ గ్రిడ్ పరిష్కారాలు అయినా- భారతదేశానికి నైపుణ్యత, టెక్నాలజీ మరియు కల ఉన్నాయి. ‘ భారతదేశానికి వెళ్లండి, మరియు అక్కడ మీరు విద్యుత్తు ఆవిష్కరణ యొక్క భవిష్యత్తును చూస్తారు’ అని ప్రపంచం అనాలి అని ఆయన అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశం బహుళ బిలియన్ డాలర్ల ఎగుమతి మార్కెట్ ను సొంతం చేసుకోవాలని కలతో విద్యుత్తు మరియు విద్యుత్తు రంగంలో తన తయారీ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. పునరుత్పాదక శక్తి విస్తరణ, స్మార్ట్ గ్రిడ్స్ లో పురోగతులు, డిజిటల్ ఆటోమేషన్ లు సహకరించడానికి, సహ-సృష్టికి వ్యాపారాల కోసం కొత్త అవకాశాలను అందిస్తున్నాయి మరియు విద్యుత్తు పరిష్కారాల కోసం భారతదేశాన్ని అంతర్జాతీయ పవర్ హౌస్ గా స్థిరపరుస్తున్నాయి అని శ్రీ గోయల్ అన్నారు. “మన పరిశ్రమ విస్తృతంగా ఆలోచించాలి, వేగంగా వ్యవహరించాలి మరియు కలిసికట్టుగా పని చేయాలి. ఒక వేదికలో ఏకీకృతమవడం ద్వారా, మనం మన దేశీయ రంగాన్ని శక్తివంతం చేయడమే కాకుండా భారతదేశాన్ని అంతర్జాతీయ సరఫరా చెయిన్ లో ఒక నాయకునిగా ఉంచింది. అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది, మనం దాన్ని తప్పనిసరిగా అందుకోవాలి,” అని ఆయన ముగించారు. రివర్స్ సెల్లర్ బయ్యర్ మీట్ (RBSM)లో విమల్ ఆనంద్, జాయింట్ సెక్రటరీ, కామర్స్ మరియు ఇండస్ట్రీ శాఖ, భారత ప్రభుత్వంచే అంగీకార పత్రంపై సంతకం చేసిన చర్యకు కూడా ఈ రోజు ఒక మైలురాయిగా నిలిచింది, శక్తివంతమైన పరిశ్రమ సహకారాలకు మరియు అంతర్జాతీయ భాగస్వామాల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఒప్పందాలు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాల విస్తరణ దిశగా ఒక గణనీయమైన చర్యను సూచిస్తున్నాయి, పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నాయి మరియు భారతదేశపు విద్యుత్తు రంగంలో సాంకేతికత నాయకత్వంవహించే అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. విమల్ ఆనంద్, జాయింట్ సెక్రటరీ, కామర్స్ మరియు ఇండస్ట్రీ శాఖ, భారత ప్రభుత్వం ఇలా అన్నారు “భారతదేశపు అభివృద్ధి మౌళిక సదుపాయాల వృద్ధిని తనతో సహజంగా తీసుకువస్తోంది మరియు మౌళికసదుపాయాల వృద్ధితో, భవంతుల నిర్మాణం విషయంలోనే కాకుండా, వివిధ ఇతర మౌళికసదుపాయాల ప్రాజెక్టులు, లాజిస్టిక్స్, సంచార పరిష్కారాలు, యుటిలిటి పరిష్కారాలతో, మేము అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మరియు త్వరలోనే, 2030 నాటికి GDP విషయంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మేము మారడానికి ఆలోచిస్తున్నాము కానీ వచ్చే ఏడాది నాటికి, నిజానికి మేము ఆ హోదాను వాయిదా వేయబోతున్నాం మరియు వచ్చే ఏడాది నాటికి మనం సాధ్యమైనంత వరకు మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం.”
ఈ పురోగతిని మరింత పెంచుతూ, eTECHnxt కాన్ఫరెన్స్ అయిదవ ఎడిషన్ ప్రారంభించబడింది, పరిశుభ్రమైన శక్తి, కార్బన్ మార్కెట్లు, శక్తి నిల్వ చేయడం మరియు విద్యుదుత్పాదనలో డిజిటల్ పరివర్తనను చర్చించడానికి నిపుణులను ఒక చోట చేర్చింది. సాంకేతికతను మించి, డిజిటలీకరణ, స్మార్ట్ గ్రిడ్స్, సిబ్బందికి నైపుణ్యాలలో శిక్షణ, పరిశుభ్రమైన, టెక్ –ప్రోత్సాహిత శక్తి రంగానికి నైపుణ్యాలతో సమకూరిన సిబ్బంది కావాలని గుర్తించే ఆవశ్యకతను సమావేశం తెలియచేసింది. ఈ సమావేశంలో విస్తృతమైన శ్వేత పత్రం-పునరుత్పాదక శక్తి, వ్యయ-సామర్థ్యం మరియు గ్రిడ్ ఆధునీకరణలో శక్తిని నిల్వ చేసే బాధ్యతను ప్రధానాంశం చేస్తూ విద్యుత్తు ఉత్పత్తిలో కొత్త పరిమితుల విడుదల కూడా జరిగింది. జర్మనీ, భారతదేశం రాయబార కార్యాలయం రాయబారి హెచ్.ఈ. డాక్టర్. ఫిలిప్ అకెర్మాన్, నాయకత్వంలో ‘భారత్, విశ్వామిత్ర’ అనే శీర్షికతో జరిగిన అభిప్రాయాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు ముగిసింది. ఉన్నతాభివృద్ధి సుస్థిరపరుస్తూనే సమీకృత అభివృద్ధిని నిర్థారించడానికి నిర్మాణపరమైన సంస్కారాలు, డిజిటలీటకరణ మరియు మౌళికసదుపాయాల బాధ్యత పై కీలకమైన కేంద్రీకరణ జరిగింది. శక్తి మరియు విద్యుదుత్పాన పరిశ్రమ దృష్టి కోణం నుండి, పునరుత్పాదక శక్తి, స్మార్ట్ గ్రిడ్స్ మరియు ఇంధన నిల్వలో పెట్టుబడుల ద్వారా భారతదేశం స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తుకు మారడం పై చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయి. అంతర్జాతీయ విధాన నిర్ణేతలు, వ్యాపార నాయకులు మరియు సాంకేతిక మార్గదర్శకుల భాగస్వామ్యంతో, ELECRAMA 2025 భారతదేశం విద్యుత్తు రంగం యొక్క భవిష్యత్తును రూపొందించే ప్రభావవంతమైన సంభాషణలను ప్రోత్సహించడం కొనసాగిస్తోంది. పాలసీ, టెక్నాలజీ మరియు మార్కెట్ సంసిద్ధతల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా భారతదేశపు పరిశుభ్రమైన శక్తి పరివర్తనను పెంచడంలో మరియు సమర్థవంతమైన, భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉండే శక్తి మౌళిక సదుపాయం స్థాపనలో కార్యక్రమం కీలకమైన బాధ్యతవహిస్తుంది.