జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ వద్దు: మంత్రి శ్రీధర్ బాబు

– ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యమాలు చేయాలనీ కార్యకర్తలకీ పిలుపు
– నవతెలంగాణ – మహాదేవ్ పూర్
ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక, సేవ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు, నా అభిమానులందరికీ విజ్ఞప్తి చేశారు. మంథని నియోజకవర్గంలో ఐదుసార్లు అవకాశం ఇచ్చి, శాసనసభ్యునిగా నా వెన్నంటే ఉండి, నన్ను గెలిపించిన ప్రతి ఒక్క ఓటరు, కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా పుట్టినరోజున సందర్భంగా కేక్ కటింగ్ లు, ఇతర ఎలాంటి కార్యక్రమం చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక, సేవ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Spread the love