
మన ప్రాచీన సాంస్కృతిక సంపాదన నిరంతరం కాపాడుకోవాలని, మన కట్టు బొట్టు సంప్రదాయాలు మరవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఆదివాసీ కళా క్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన ట్రైనింగ్ సంస్థ వారు నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శన లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర జరుగుతుందని, సుమక్క సారలమ్మ జాతర సందర్భంగా కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని, రేపు ముందు సారలమ్మ గద్దె పైకి వస్తుందని మంత్రి తెలిపారు. ఆసియా ఖండం లోనే అతి పెద్ద జాతరగా పేరు పొందిన మేడారం జాతర మహా మరీ కొద్ది గంటలోనే , వనం నుండి జనం లోకి వస్తున్న సమ్మక్క – సారలమ్మ లను కొలిచిన వారికి కొంగు బంగారమే అంటూ కొనియాడారు. జీవితంలో మనం ఏ స్థాయికి ఎదిగినప్పటికీ తర తరాతరాల నుండి వస్తున్న మన కట్టు బొట్టు , సంస్కృతి, సంసంప్రదాయలను మరవొద్దని , దేశంలో ఉన్న విభిన్న సాంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ గా జరుపుకునే ఈ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని , జతర కి వచ్చే ప్రతి భక్తుడుని వి ఐ పి గా పరిగణిస్తూ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ రోజు నుండి జాతర జరిగే ప్రతి రోజూ సాయంత్రం జరిగే ఈ నృత్య ప్రదర్శనల్లో గిరిజనులు తమ తమ నృత్య ప్రదర్శనలతో అలరిస్తారని, గొండ్ గుస్సాడి, చచ్చోయి , కొమ్ము కోయా, రెలా, నాయక్ పొడు లక్ష్మి దేవరా, ఆంధ్ర వాగే, దండర్ అదివాసి నృత్యాలతో అలరించన్నున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎటురునాగరం ఐ .టి.డి. ఏ పి.ఓ అంకిత్ కుమార్ , గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశర్ రెడ్డి , ఉప సంచాలకులు దిలీప్ కుమార్ , సంగ్రహాలయ అధికారి డా. సత్య నారాయణ , ఉప సంచాలకులు ఇందిరా, శైలజ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నార