
ఇటివల కారు ప్రమాదంలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను గురువారం మంత్రి శ్రీధర్ బాబు యశోద హాస్పిటల్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు ధైర్యంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితం లోకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆకాంక్షించారు.