నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) మంజూరు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలోని విద్యార్థులు ఇక్కడే టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులను పూర్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.