నవతెలంగాణ- కమ్మర్ పల్లి : వేల్పూర్ లోని స్పైసిస్ పార్క్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సభ ప్రారంభానికి ముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి స్టేజిపై డ్యాన్స్ చేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సభ సందర్భంగా ధూంధాం కళాకారులు ఆలపిస్తున్న గేయాలకు వేదికకు ముందు గ్యాలరీలో ఉన్న యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేయడంతో వారిని ఉత్తేజపరిచేందుకు సభా వేదిక పైన ఉన్న మంత్రి కూడా డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులను కూడా పిలవడంతో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, తదితరులు మంత్రితో కలిసి డ్యాన్స్ చేశారు. మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు డ్యాన్స్ తో గ్యాలరీలో ఉన్న యువకుల చప్పట్లు, కేకలు ఈలల జోష్ తో సభ ప్రాంగణం దద్దరిల్లింది.