17 కోట్ల 44 లక్షల నిధుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే హనుమంత్ సిందే శంకుస్థాపనలు

– జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే హనుమంత్ షిండే
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని మద్నూర్ గోజేగావ్ సోమూర్ రాచూర్ దన్నూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు గాను 17 కోట్ల 44 లక్షల నిధులు మంజూరు చేయించి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే బుధవారం నాడు ఐదు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయంలో మద్నూర్ మండలంలో ముఖ్యమైన రోడ్లకు బ్రిడ్జిలకు 17 కోట్ల 44 లక్షల నిధులు అభివృద్ధి పనులకు గాను మంజూరు చేసినందుకు మద్నూర్ మండల తరఫున జుక్కల్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మద్నూర్ మండల కేంద్రంలో 9 కోట్ల నిధులతో సెంటర్ లైటింగ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఐదు లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. మండలంలోని గోజేగావ్ గ్రామానికి వెళ్లడానికి మధ్యలో లేండి వాగు పైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరైన దానికి అదే విధంగా సోనాల రోడ్డు నుండి బ్రిడ్జి వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 50 లక్షల నిధులు గోజేగావ్ గ్రామం నుండి మహారాష్ట్ర బార్డర్ వరకు వీటి రోడ్డు నిర్మాణం కోసం ఒక కోటి నలభై లక్షల రూపాయలు నిధులు మంజూరు. చేసి శంకుస్థాపన చేశారు అదేవిధంగా మండలంలోని సోమూర్ అంతాపూర్ మధ్యలో గల వాగు పైన వంచన నిర్మాణానికి మూడున్నర కోట్లు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు మద్నూర్ జుక్కల్ వెళ్లే డిటి రోడ్డు నుండి సోమూరు వరకు వీటి రోడ్డు నిర్మాణం కోసం 60 లక్షల నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు ధన్నూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఐదు లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు ఇక అతి ముఖ్యమైన రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్ల 70 లక్షల నిధులు మంజూరు. చేయించి శంకుస్థాపన చేశారు. ఈ విధంగా మొత్తం 17 కోట్ల 44 లక్షల నిధుల పనులకు ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో మద్నూర్ సర్పంచ్ సురేష్ గోజేగావ్ సర్పంచ్ అనిత ఇరవంత్ దేశముఖ అంతాపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు రాజు సోమూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గంగాబాయి కాశీనాథ్ పటేల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగ్మారే లక్ష్మీబాయి మండల జెడ్ పిటిసి కుటుంబ సభ్యులు కథలయ్య మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీరాజ్ శాఖ ఏఈ మధుసూదన్ ఆర్అండ్ బి శాఖ డిప్యూటీ ఈఈ కిషన్ ఏ ఈ వినోద్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love