Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాకా విత్తనాలు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

హాకా విత్తనాలు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ కూడలి సమీపంలో 6వ వార్డుకు చెందిన యువకుడు కురుమూర్తి ఏర్పాటు చేసుకున్న హాక విత్తనాలు ఎరువుల దుకాణాన్ని గురువారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి గార్లు ప్రారంభించారు. వ్యాపార ధోరణిలో అన్నదాతలకు అధిక ధరలకు కాకుండా వారి అవసరానికి తగ్గట్లుగా అన్ని విత్తనాలు ఎరువులు మందులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని యువకుడు కురుమూర్తికి వారు సూచించారు. యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -