త్వరితగతిన అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే ‘జారే’ 

– విద్యాభివృద్ధికి తాగునీరు,విద్యా,వైద్యానికి ప్రాధాన్యం..
– 100 రోజుల్లోనే 8 హామీల అమలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 8 హామీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అమల్లోకి తీసు కొచ్చామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెల్లడించారు. అనతికాలంలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ.17.75 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చెయించినట్లు చెప్పారు.స్థానిక ఎమ్మల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏజన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీరు,వైద్యం, విద్యాభివృద్దికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.కొద్ది నెలల్లోనే మంజూరైన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.ఎమ్మల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ప్రకటించారు. సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 14 కార్పోరేషన్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని,ప్రయాణికులకు కనీస మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.అశ్వారావుపేట కు అతి త్వరలోనే మినీ అర్టినీ డిపో మంజూరు అవుతుందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ నుండి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని గృహ జ్యోతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించాలని సూచించారు. ఆయన వెంట అశ్వారావుపేట పీఏసీఎస్ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,ఎంపీటీసీ వేముల భారతి,కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,మొగళ్ళపు చెన్నకేశవరావు,సత్యవరరుపు బాలగంగాధర్,జూపల్లి ప్రమోద్,సత్యనారాయణ చౌదరి,తుమ్మ రాంబాబు,బత్తిన పార్ధసారధి, కానూరు మోహన్ రావు,రాములు, తదితరులు ఉన్నారు.
Spread the love