ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే జారే..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజారోగ్యం పట్ల వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర సేవల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని,సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంత గర్భిణీ వైద్యసేవలు కోసం వినియోగించే అవ్వల్ అంబులెన్స్ ను శనివారం ఆయన ప్రారంభించారు. వినాయకపురం పి.హెచ్.సి లో అవ్వల్ అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పీహెచ్ సీలు పరిధిలోని కొండ రెడ్లు, గిరిజనుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన అంబులెన్స్ ద్వారా ఉత్తమ సేవలను అందించాలని అన్నారు. అంబులెన్స్ ద్వారా గర్భిణులకు సేవలు అందించి, మాత శిశు మరణాలను తగ్గించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అనంతరం పీహెచ్ సీల సమస్యలపై వైద్యాధికారులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించగా, పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.ఎం.హెచ్.ఒ  భాస్కర్ నాయక్, పీహెచ్ సీ వైద్యులు డాక్టర్ రాందాస్ నాయక్, డాక్టర్ కృష్ణ దీపక్ రెడ్డి, డాక్టర్ మధుళిక, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love